Serial killer: పంజాబ్‌లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లాలో గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్‌గా గుర్తించారు.