Women Employment: ఇటీవల కాలంలో మహిళ ఉపాధి ధోరణలు పెరుగుతున్నాయి. ప్రతీ రంగంలో వారి ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్‌లో వీరికి మంచి ఉపాధి లభిస్తోంది. ఇదిలా ఉంటే మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహిళా శ్రామిక శక్తికి భాగ్యనగరం గమ్యస్థానంగా నిలుస్తోంది. పూణే, చెన్నై నగరాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) హస్పటల్ లో జాయిన్ అయ్యారు. పుణెలోని భారతీ హాస్పిటల్‌లో బుధవారం నాడు రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్‌తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
మాములుగా అయితే ఏటీఎంను చోరీ చేయడం చూశాం.. నగదు, బంగారం చోరీ చేయడం చూశాం.. కానీ వెరైటీ ఈ దొంగలు ఈవీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పూణేలోని రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున పుణె జిల్లా సస్వాద్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ గదిలో ఉన్న ఈవీఎం మెషీన్‌కు చెందిన డెమో మిషన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగా.. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. స్ట్రాంగ్‌రూమ్ తాళం పగులగొట్టి, గదిలో…
Worst Traffic: భారతదేశ నగరాల్లో ఇటీవల కాలంలో ట్రాఫిక్ కష్టాలు పెరగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ నివేదిక ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాను వెల్లడించింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాల్లోని 387 నగరాలను, వాటి సగటు ప్రయాణ సమయం,
Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్‌వాడ్‌లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్‌లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్‌ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
MLA Slaps Police: విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పూణేలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్యెల్యే చేయి చేసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు.
NIA Raids : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఉత్తర రైల్వేలో ఒక క్లర్క్ కోసం వెతుకుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Wife Kills Husband: భార్య పుట్టిన రోజు వివాదం భర్తకు చావుగా మారింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భార్య, భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో భార్య, భర్త ముక్కుపై కొట్టింది. దీంతో 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియన్ సొసైటీలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.
ప్రజల సొంతింటి కల ఎంతలా ఉంటుందనే దానికి పూణేలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పూణేలోని నివాసితులు రూ. 1.5-2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఏకంగా 8 గంటలు క్యూలో నిల్చుకున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాద్ ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.