పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 25న (మంగళవారం) ఉదయం 6 గంటలకు అత్యంత రద్దీగా ఉండే పూణెలోని స్వర్గేట్ బస్సు డిపోలో యువతి(26)పై దత్తాత్రే రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
Rahul Gandhi: హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కోర్టు రూ. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్ దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు మనోరమ తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పూణే…