పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 25న (మంగళవారం) ఉదయం 6 గంటలకు అత్యంత రద్దీగా ఉండే పూణెలోని స్వర్గేట్ బస్సు డిపోలో యువతి(26)పై దత్తాత్రే రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో 13 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పట్టాయి. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Akhanda 2: హిమాలయాల బాటపట్టిన బోయపాటి
అయితే నిందితుడు రాందాస్.. సంఘటనాస్థలి నుంచి పారిపోయి స్వస్థలంలోని సమీప పొలాల్లోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. రెండు రోజుల పాట చెరుకు తోటలోనే మకాం పెట్టాడు. అయితే రెండు రోజుల పాటు ఆకలితో అల్లాడిపోయాడు. తాగేందుకు కూడా కనీసం నీళ్లు దొరకలేదు. ఓ వైపు గొంతెండి పోయింది.. ఇంకోవైపు కడుపు కాలిపోయింది. మరోవైపు పోలీసులు వెంటాడుతున్నారన్న భయం ఉంది. ఇలా రెండు రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అయితే అప్పటికే పోలీసులు బృందాలుగా విడిపోయి వేట సాగిస్తున్నారు. డ్రోన్లు, కుక్కలతో వెంటాడుతున్నారు. డ్రోన్ ద్వారా నిందితుడు చెరుకు తోటలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే చెరుకు తోట ఎత్తుగా ఉండడం వల్ల వెంటనే సాధ్యం కాలేదు. అయితే అప్పటికే నిందితుడు ఆకలి, నీళ్లు లేక గిజగిజలాడిపోతున్నాడు. దీంతో సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి.. తినేందుకు భోజనం, నీళ్లు ఇవ్వాలని కోరాడు. అయితే ఆ ఇంటి యాజమాని వెంటనే నీళ్లు అందించాడు. అనంతరం పూణె పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న సోదరుడికి పోన్ చేసి సమాచారం అందించాడు. అతడు.. సీనియర్ ఆఫీసర్లుకు తెలియజేయగా.. వెంటనే వచ్చి గురువారం రాత్రి 10:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక నిందితుడిని కోర్టులో హాజరు పరచగా మార్చి 12 వరకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే నిందితుడు తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశాడు. యువతి సమ్మతితోనే రాందాస్ కలుసుకున్నారని.. న్యాయవాది వాజిద్ ఖాన్ కోర్టుకు తెలిపారు. నిందితుడు.. బాధితురాలి మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే.. బస్సులో కలుసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం ఏర్పడిందని వెల్లడించారు.
నిందితుడిపై పూణె, అహల్యానగర్ జిల్లాల్లో దొంగతనం, దోపిడీ, గొలుసు దొంగతనం వంటి అర డజను కేసులు ఉన్నాయని తెలిపారు. 2019 నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్.. మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు