కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. కోనసీమ రైతులకు అండగా జనసేన.వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు.కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదన్నారు పవన్…
మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు. పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం…
అమలాపురం వ్యవహారంలో మంత్రుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోం మంత్రి వనిత మా పేరు వివాదంలోకి లాగారు. హోం మంత్రి వ్యాఖ్యలకు మేం ఆశ్చర్యపోతున్నాం. తల్లి పెంపకం సరిగా ఉండాలంటూ హోం మంత్రి కామెంట్ చేశారు. ఆరేళ్ల బిడ్డ కూడా అత్యాచారానికి గురైతే తల్లుల పెంపకమే తప్పా..? ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. దళితులపై దాడులు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1గా నిలిచిందని రామ్ దాస్ అథవాలే స్వయంగా…
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో…
‘ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇందులో గొప్పేముంది? ‘మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇది కదా మజా ఇచ్చేది! సినిమా రంగంలో అధిక సంఖ్యాకులు ‘ప్లస్ ఇంటూ ప్లస్’కే జై కొడతారు. కానీ, కొన్నిసార్లు ‘మైనస్ ఇంటూ మైనస్ – ప్లస్’ అవుతుందనీ నిరూపణ అయ్యింది. అలా చేసిన చిత్రాల్లో పదేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా జనం ముందు నిలచిన ‘గబ్బర్ సింగ్’ కూడా…
సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.
ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది…