ఏపీలో అటు వైసీపీ ఇటు జనసేన నేతల విమర్శలు హీటెక్కిస్తున్నాయి. కడప పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఘాటైన విమర్శలకు దిగారు. చంద్రబాబు దత్త పుత్రుడు రైతులకు మేలు చేయడానికి రాలేదు..కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారు. కడప జిల్లాలో కులాలు లేవు, మతాలు లేవు అందరూ ఒకటే ఆన్న విధంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోంది.
Read Also: Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం దెబ్బలు తినడానికైనా రెడీ
ప్రశ్నించడానికి వచ్చిన పవణ్ కళ్యాణ్ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులు అత్మ హత్యలు చేసుకున్నా, నీళ్ళు లేకపోయినా ఎందుకు ఆ రోజు ప్రశ్నించ లేదు. ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు అంజాద్ బాషా. ప్యాకేజీ కుదిరాక ఏదో పర్యటన చేసి విమర్శిస్తున్నారు..గత టిడిపి ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టీ, మద్యం ఏరులై పారి నప్పుడు.. మాట్లాడకుండా ఉన్న పవన్ ఎందుకు అప్పుడు మాట్లాడలేదు..వైసిపి ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసింది. ఇది తెలియక మాట్లాడుతున్నారు
కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసిపి.. కరుడు గట్టిన టిడిపి కార్య కర్తలకు కూడా మంచి చేస్తున్నారు..నువ్వు, చంద్రబాబు కలిసి వైసిపికి కులం, మతం అంట గడుతున్నారు..షర్మిల ఎప్పుడైనా జగన్ అన్యాయం చేసారని చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. నీ భార్య మీపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం మర్చిపోవద్దు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ జిల్లా ప్రజలు తరిమి తరిమికొడతారు.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తు న్నావు…నీకు ఒక హిడెన్ అజెండా ఉంది..కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తూ న్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ.. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తాం అని సవాల్ విసురుతున్నా అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
Read Also: Himachal Pradesh Flash Floods: మెరుపు వరదలు.. ఇప్పటి వరకు 19 మంది మృతి