Pawan Kalyan: రోడ్ల దుస్థితిపై రేపటి నుంచే పవన్ డిజిటల్ క్యాంపెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయి. రోడ్ల దుస్థితి తెలిపేలా #Good Morning CM Sir డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నాం. రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీ అరా గోతులు కనిపించడం సహజం. మన రాష్ట్రంలో మాత్రం గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి. కొన్ని రహదారులను చూస్తుంటే ఏకంగా స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి, కనీస మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ప్రభుత్వామికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు.ఆ ఛాలెంజీను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టాం.9,222 కి.మీ పంచాయతీ రోడ్లు మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించింది.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు.క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది.రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి.మూగ జీవాలు కదా.. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైసీపీ నాయకులు రోడ్లు వేయడం మానేశారు.ఏటా కనీసం 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయాలి.ఇందుకోసం దాదాపు రూ.1500 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్, రిపేర్లు చేయాలి. ఇందుకోసం మరో రూ.500 కోట్లు అదనంగా అవసరం ఉంటుంది.
No ‘Sun’Day: ఈ వర్షం సాక్షిగా.. సూర్యుణ్ని చూడక ఎన్ని రోజులైందో?
నాన్ ప్లాన్ బడ్జెట్లో చూపిస్తారు. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం మానేసింది.ఈ మూడేళ్లలో మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయకపోవడంతో రహదారులు చాలా వరకు దెబ్బ తిన్నాయి.30 వేల కిమీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతలమయంగా మారింది.మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి.మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమే.ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు, ఒక లేయర్ వేసి కాస్త ప్రయాణానికి తగ్గ విధంగా చేయాలంటే దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా.
8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2100 కోట్లు అప్పు తెచ్చారు.వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు.రోడ్ల నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారు.ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుంది.ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియడం లేదు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు రోడ్లు అవసరం లేదనే ఆలోచన విధానంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తెలియజేయడం కోసం #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం.మీ ఊళ్ళో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అనేది చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి.వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయండి.ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో నేను కూడా పాల్గొంటాను. ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!