ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదని, వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలన్నారు. నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలనని, నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో…
ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో ముందుగా అంగీకరించిన కార్యక్రమం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కానీ ఆ పుస్తకం విడుదలైన వెంటనే…
రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ ఒక కోట్ పోస్ట్ చేసారు. ఇది సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిగా కనిపిస్తుంది. ఎలాంటి రిఫరెన్స్ తీసుకోకుండా లేదా ఎలాంటి ఉదంతాన్ని ఉటంకించకుండా, పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. “నాకు ఇష్టమైన వాటిలో ఒకటి: ‘ఎర’ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది…. – వాకాడ శ్రీనివాసరావు”. అని పోస్ట్ చేశారు. అయితే…
ఏపీలో వినోదం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం టికెట్ల రేట్లపై హేతుబద్ధత తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా కమిటీ ఏర్పాటుచేసింది. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ సీఎం జగన్ తో చర్చించిన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విధానాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు మంత్రి పేర్ని నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో కానీ,…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అటు టీడీపీ కూడా అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వైసీపీ నేత సజ్జల. టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలభిస్తుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఆధిపత్య…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా వుంటారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ఎయిడెడ్ సంస్థల విలీన నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ర్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ప్రక్రియపై వ్యంగ్యంగా ట్వీట్లు పోస్ట్ చేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేస్తోంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకల్ హజబ్బ స్కూలుని కట్టారు. పండ్లు అమ్మిన డబ్బుతో హరేకల హజబ్బ స్కూలును ఎలా నిర్మించగలిగారు అని ట్వీట్…
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇవాళ పవన్ కల్యాణ్ విశాఖపట్నం రానున్నారు. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో…
కరోనాపై పోరాటంలో దేశం మైలురాయిని అధిగమించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. 100 కోట్ల డోసుల్ని దేశం దాటేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ వీడియో విడుదల చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలు రాయి. ప్రధాన మంత్రి నరేంద్ర…
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇటీవలే రోడ్డుప్రమాదానికి గురైన సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆగడంలేదు. తన మేనల్లుడు ఆసుపత్రిలో ఉండడంతో, అతడు నటించిన సినిమాను మరింతగా ప్రమోట్ చేయాలని…