Pawan Vizianagaram Tour: విజయనగరం బయలుదేరిన పవన్… ఫ్యాన్స్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ నోవాటెల్ నుంచి విజయనగరం బయలుదేరారు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పవన్ విజయనగరం వెళుతున్నారని తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు విశాఖలోని పవన్ బస చేసిన హోటల్ కి చేరుకుని నినాదాలు చేశారు. ఇవాళ విజయనగరంలో గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి రోడు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్…
నోవాటల్ నుండి విజయనగరం రోడ్డు మార్గాన బయలుదేరారు. భీమిలి జాతీయ రహదారిపై స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్. వై జంక్షన్ నుంచి ర్యాలీగా గుంకలాం చేరుకుంటారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం చేపట్టింది.
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు, గృహనిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపించబోతున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని జనసేన చేపట్టింది. గుంకలాంలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించి పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు. 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారని జనసేన పార్టీ గుర్తుచేసింది. దీంతో సీఎం శంకుస్థాపన చేసిన గుంకలాం గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారు. పవన్ పర్యటనపై వైసీపీ విమర్శలు చేస్తున్నా… వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని జనసేన పార్టీ పేర్కొంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!