ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు.
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసనలు బుధవారం ఉదయం తీవ్రమయ్యాయి, ఇంఫాల్‌లో పోలీసు సిబ్బందితో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాంను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకురానున్న కొత్త యూనిఫామ్ అక్కడ నివసించే ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త యూనిఫామ్ తీసుకురావడంపై నిరసన వ్యక్తం చేసింది.
పుంగనూరులో పోలీసులపై టీడీపీ దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. నల్ల రిబ్బన్లతో చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తీసుకురానున్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)పై కేరళ ప్రతిపక్షం ఆందోళనలకు సిద్ధపడింది. కేరళలో సీపీఐఎం అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగుతోంది.
ఫ్రాన్స్ లో హింస ఆగడం లేదు. నాలుగు రోజుల క్రితం పారిస్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. దీంతో అల్లర్లు రచ్చరచ్చ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి.