కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీపై టీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. అయితే.. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ నరసన బాటపట్టింది. అయితే.. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని టీఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించిన అంశంపై ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు, స్టాళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త ఘటనల కారణంగా కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నుంచి ఆందోళనకారులు బయటకు వెళ్లకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌కు రావాల్సిన కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిరసనకారులను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని, రైల్వే ఆస్తులకు ఎంతమేర నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. సికింద్రాబాద్ నుంచి…
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని సింగరేణి నిర్వాశిత గ్రామం లద్నాపూర్ గ్రామస్తులు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..గ్రామంలో ఉన్న 283 మంది భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరిస్తున్నారు.. సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నపూర్ లో నిర్వాసితులకు సింగరేణి అధికారులకు మధ్య గొడవ కంటిన్యూ అవుతుంది..సింగరేణి అధికారులు…
ఉపాధ్యాయ సర్వీసు నిబంధనల రూపకల్పనలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్ 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ధర్నాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు వెల్లడించారు. అటు రాష్ట్రస్థాయిలో జూన్ 17 నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యానారాయణకు 11 డిమాండ్లతో కూడిన లేఖ రాశామన్నారు.…
కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కోనసీమ పేరు మార్పును నిరసిస్తూ రెండురోజుల క్రితం అమలాపురంలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి…
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000…
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో ఒక్కసారిగా అమలాపురం అట్టుడికిపోయింది.. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు… మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇక, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.. దీంతో, అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడింది విశాల్ గున్ని…