హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Read: ఆ గ్రామంలో నివశించాలంటే… ఆ అవయవం తీయించుకోవాల్సిందే.. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత…
ఇటలీ ఎయిర్ హోస్టెస్ అర్ధనగ్న ప్రదర్శనలతో కూడిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇటలీలోని అలిటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 50 మంది ఎయిర్‌హోస్టెస్‌లు అర్ధనగ్న నిరసనలకు దిగారు. రోమ్‌లోని టౌన్ హాలు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. జీతంలో కోతలు, ఉద్యోగాలు తొలగించడం పై మనస్తాపం చెంది నిరసనలకు దిగినట్టు చెప్పారు. ఈ మధ్య కాలంలో అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ను తాజాగా ఐటీఏ ఎయిర్‌వేస్ స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామం అలిటాలియా…
పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. తన విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని…
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చిందో అప్పటి నుంచే కార్మికులు, ఉద్యోగులు నిరసనబాట పట్టారు. వివిధ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు కార్మికుల నిరసనలకు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం నేటికి 250 రోజులు పూర్తయింది. దీంతో ఈరోజు 250 మందితో25…
వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేశారు. ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కర్నాల్ లో రైతులు రోడ్డు మీదకు చేరుకొని నిరసనలు…
ఉల్లి పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువగా ఉల్లిని పండిస్తుంటారు. ఉల్లి పంటకు ఎప్పుడు గిరాకి వస్తుందే ఎప్పడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయడం వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనల చేస్తున్నారు. ఈనాం పద్దతిలో ఉల్లిని కోనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, తాము ఈనాం పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయలేమని చెప్పి…
తెలంగాణలో ఒకవైపు లాక్‌డౌన్ కొనసాగుతుండగా మరోవైపు రైతులు ఆంధోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని తుఫ్రాన్ మండలంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆంధోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు నిరసనలు చేస్తున్నారు. పంటను రోడ్లపై పోసి తగలబెట్టారు. దీంతో గజ్వేల్-తుఫ్రాన్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాక్ సడలింపుల సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే ఆంధోళనలు ఉదృతం చేస్తామని…