ప్రొఫెసర్ కోదండరామ్..... పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పే సారు. క్లాస్‌రూమ్ లెసన్స్‌లో తనకు తిరుగులేదని అనింపించుకున్న ఈ మాస్టారు..... పొలిటికల్ ప్రాక్టికల్స్‌లో మాత్రం బాగా వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని తెలిపారు.
Kodandaram: తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సుయాత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు.
సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ సీఎం అయ్యాడని, దళితుల, బీసీల, మైనారిటీల సంక్షేమం కోసం మార్చాలి అంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, సీఎం చేసిన వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఏప్రిల్ 9న నిరసనకు అనుమతి…