బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ తల్లి నిర్మాత గా మారుతోంది. తన కూతురు కెరీర్ ను గాడిలో పెట్టడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కొందరు కథానాయికలు నిర్మాతలుగా మారారు. అవికా గోర్ తాను నటిస్తున్న దాదాపు అన్ని చిత్రాలకూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇక రాజ్ కందుకూరి తనయుడు శివ నటిస్తున్న ‘మను చరిత్ర’ చిత్రానికి కాజల్ సమర్పకురాలిగా ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ గా…
విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే…
తెలుగు చిత్రసీమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం నడుం బిగించేవారిలో ముందువరుసలో ఉంటారు దగ్గుబాటి సురేశ్ బాబు. అంతకు ముందు ఆయన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూడా అదే తీరున తెలుగు సినిమా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి సురేశ్ బాబుతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ మన తెలుగు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మాతగా మారి రిలీజ్ చేశాడు.. ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ కాగా , రెండోది నితిన్ నటించిన చల్ మోహన్ రంగ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పవన్ కల్యాణ్…
తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు. ‘జగపతి’ బ్యానర్ కు జనం మదిలో ఓ తరిగిపోని స్థానం సంపాదించారు. తన చిత్రాలలో పాటలకు పెద్ద పీట వేసేవారు రాజేంద్రప్రసాద్. తరువాతి రోజుల్లో తన సినిమాల్లోని పాటలను కలిపి, కాసింత వ్యాఖ్యానం జోడించి, ‘చిటపటచినుకులు’ అనే మకుటంతో రెండు…
తెలుగు చిత్రసీమలో ఎందరో స్టార్ హీరోస్ కు వారి తమ్ముళ్ళు నిర్మాతలుగా మారి చిత్రాలను నిర్మించి, విజయాలను చేకూర్చారు. మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద తమ్ముడు నాగేంద్రబాబును ముందు నటునిగా జనం ముందు నిలిపి, తరువాత నిర్మాతను చేశారు. నాగబాబు సైతం తన అన్న చిరంజీవి హీరోగా కొన్ని చిత్రాలు నిర్మించి అభిమానులకు ఆనందం పంచారు. నటునిగా నిర్మాతగా నాగబాబు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు నాగబాబు. కొణిదెల నాగేంద్రబాబు…
తెలుగు చిత్రసీమలో ప్రఖ్యాత నిర్మాణసంస్థలుగా వెలుగు చూసిన వాటిలో ‘వైజయంతీ మూవీస్’ స్థానం ప్రత్యేకమైనది. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభమైంది. ఈ సంస్థాధినేత చలసాని అశ్వనీదత్ చిత్రసీమలో ప్రముఖస్థానం సంపాదించారు. యన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ‘ఎదురులేని మనిషి’ చిత్రం నిర్మించి, తమ వైజయంతీ మూవీస్ కు శ్రీకారం చుట్టారు అశ్వనీదత్. తరువాత నాటి టాప్ స్టార్స్ తోనూ తరువాతి తరం అగ్రకథానాయకులతోనూ చిత్రాలను నిర్మించి జనం మదిలో మరపురాని స్థానం సంపాదించారు…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ -2’, ‘విక్రమ్’ సినిమాలలో నటిస్తున్నారు. ఇందులో మొదటి సినిమాను శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంటే, రెండో సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ నిర్మిస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాకు ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విశేషం ఏమంటే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అధినేతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తో పాటు తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో ఐదో #KA5 సినిమా ప్రకటన చేశారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కోటి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో…
(ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు బర్త్ డే సందర్భంగా) ‘కుదరవల్లి శ్రీ రామారావు తెలుసా?’ అంటే ‘ఆయనెవరు?’ అనే ఎదురుప్రశ్న వస్తుంది. అదే ‘కె.యస్. రామారావు తెలుసా?’ అనగానే ‘క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కదా!’ అనే సమాధానం వస్తుంది. జూలై 7న విజయవాడలో హరి పురుషోత్తం, రంగనాయకమ్మ దంపతులకు జన్మించిన కె. ఎస్. రామారావు అసలు పేరు కుదరవల్లి శ్రీ రామారావు. అయితే చిత్రజగత్తులో మాత్రం ఆయన కె.యస్. రామారావుగా ప్రసిద్ధులయ్యారు. ఇవాళ ఆయన జన్మదినం. తెలుగు…