టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో ఐదో #KA5 సినిమా ప్రకటన చేశారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కోటి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా పరిచయమై.. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ‘సెబాస్టియన్’ ‘సమ్మతమే’ సినిమాలు కూడా చేస్తున్నాడు.