Praja Sangrama Yatra: ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పాద యాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ సమస్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ సాగుతున్నారుజ ఈనేపథ్యంలో.. కేసీఆర్ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పురుగులు పడి పోతావ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై నెపం నెట్టి సుప్రీంకు వెళ్లి స్టే తేవాలని టీఆర్ఎస్ స్కెచ్ వేస్తుందని ఆరోపించారు. దమ్ముంటే.. ఎస్టీ రిజర్వేషన్ల…
ప్రెస్ మీట్లు కాదు.. ప్రజల ఇబ్బందులపై సమీక్ష చేయండని ఎంపీ దర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాతూ.. 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోందని పేర్కొన్నారు. చెరువులు, రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది ప్రజలను కాపాడొచ్చని సలహా ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయ లోపం కళ్ళకు…
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే బాసరలోని ఆర్టీయూకేటీ. కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవీ సాహసం చేసింది. సమస్యల సుడిగుండంలో ఉన్న విద్యార్థులను ఎన్టీవీ బృందం పలకరించింది. దారుణమైన పరిస్థితి ఉందంటూ ఎన్టీవీతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బాసర ట్రిపుల్…
తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తన బిడ్డలకు ఆ కష్టం తెలియకుండా పెంచుకుంటుంది అమ్మ. దేవుడు తాను అంతటా ఉండలేకే అమ్మను సృష్టించాడు. కడుపులో బిడ్డ పెరుగుతున్నాడనే విషయం దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చేవరకు తానే అన్నీ వుండి పెంచుతుంది ఆకన్న తల్లి. అలాంటి తల్లికి గర్భంలో నలుసు పెరుగుతుంటే తనుఎన్నికష్టాలు ఎదుర్కొంటుందో తెలుసా.. ఆమెలో నెల నెలకు పెరుగుతున్న బరువుతో పడుకోవడానికి కూడా ఎంతగా కష్టపడుతుందో ఆతల్లికి మాత్రమే తెలుసు. అయితే కడుపులో నలుసు…
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నిసార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్యలు, ఇబ్బందులతో సహాజీవనం చేస్తున్నారు పేషంట్లు, వారి అటెండర్లు. సాధారణ సమస్యలకు తోడు… ప్రభుత్వ ఆసుపత్రిలో తాగేందుకు గుక్కెడు తాగునీరు దొరకని పరిస్దితి నెలకొంది. అరగంట పైగా క్యూ లైన్లో నిలబడితే ఒక్క బాటిల్ వాటర్ దొరికితే అదే పదివేలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుక్కెడు తాగునీరు దొరకడం…
ఏడుకొండలు ఎక్కాలంటే వాళ్ళ ప్రాపకం వుండాల్సిందేనా ? కోవిడ్ నిబంధనల పేరుతో తిరుమలలో ఆంక్షలు పెరిగిపోతున్నాయా? ఆపద మొక్కులవాడిని అలిపిరి వద్దే వేడుకుని వెనుతిరగాలా? దర్శనం కావాలంటే శ్రీవారి అనుగ్రహం ఒక్కటి సరిపోదా? ఆపదమొక్కులవాడు. కోరిన వారి కోర్కెలు ఇట్టే తీర్చే దేవుడిగా పేరొందిన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. స్వామి వారి దర్శనార్దం అలిపిరి వద్దకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఆంక్షలు వుండవు. టిటిడి చెబుతున్నట్లు సప్తగిరులు పవిత్రమైనవే. అడుగడుగునా…
జిల్లా కేంద్రం వస్తుందన్న ప్రచారంతో అక్కడ రియల్ బూమ్ అందుకుంది. అదికాస్తా అధికారపార్టీ నేతకు వరంగా మారింది. ఆ ప్రాంతంలో ఏం చెయ్యాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. ఎవరు వెంచర్ వేసినా కమీషన్ ఇవ్వాల్సిందే. కప్పం కట్టందే పని జరగదు. ఇదే ఆ జిల్లాలోని అధికారపార్టీలో చర్చగా మారింది. నరసరావుపేట చుట్టూ 10 కి.మీ. పరిధిలో వెంచర్లు! నరసరావుపేట జిల్లా కేంద్రం అవుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రియల్ బూమ్…