Praja Sangrama Yatra: ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పాద యాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ సమస్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ సాగుతున్నారుజ ఈనేపథ్యంలో.. కేసీఆర్ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పురుగులు పడి పోతావ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై నెపం నెట్టి సుప్రీంకు వెళ్లి స్టే తేవాలని టీఆర్ఎస్ స్కెచ్ వేస్తుందని ఆరోపించారు. దమ్ముంటే.. ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం రా.. అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ తో కలిసి ద్రౌపది ముర్మును ఓడగొట్టేందుకు యత్నించి కేసీఆర్ ఎస్టీలకు మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరే అని మండిపడ్డారు. తడిబట్టతో గొంతు కోసే మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ సహా అన్ని స్కాముల్లోనూ కేసీఆర్ కుటుంబమే అని తీవ్ర విమర్శలు చేశారు. క్వారంటైన్ పేరుతో ఏ స్కాంకు స్కెచ్ వేస్తున్నరో తెలియదు అన్నారు. 22న పెద్ద అంబర్ పేటలో జరిగే భారీ బహిరంగ సభకు తరలిరావాలంటూ పిలుపునిచ్చారు.
మౌలాలిలోని మనీషా గార్డెన్స్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. గంగపుత్రులు కలిసారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. కులవృత్తులను కేసీఆఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 6 ను తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6 ను వెంటనే రద్దు చేయాలని వినితి పత్రంలో పేర్కొన్నారు. చేపలు పట్టే వృత్తి గంగపుత్రులకే హక్కుగా ఉండాలని డిమాండ్ చేశారు. గంగపుత్రులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కోరారు. గంగపుత్రుల హక్కులు కాలరాస్తూ… ఇతరులకు మా కులవృత్తిని దాసోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర కులస్తుల నుండి రక్షణ కొరకు ఒక ప్రత్యేక గంగపుత్ర చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు. వాజ్పేయి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఎస్టీ జాబితాలో గంగపుత్రులను చేర్చాలని బండి సంజయ్ తో విన్నవించారు. దీంతో స్పందించిన బండి సంజయ్ మీ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తా అని తెలిపారు. అన్ని కులాలు, అన్ని వర్గాలలోని అర్హులకు బీజేపీ తప్పక న్యాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు.
Minister RK Roja: డేటా చౌర్యం టీడీపీ దుష్టపన్నాగం