Navya Haridas: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె నిర్వహించిన రోడ్ షోతో పాటు బహిరంగ సభపై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Wayanad bypoll:కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రియాంకా తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
Priyanka Gandhi Nomination: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్న ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఈరోజు (బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే వయనాడ్ బైపోల్ మాత్రం రసవత్తరంగా మారింది. ఇక్కడ తొలిసారి ప్రియాంకాగాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేయడమే కారణం.
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు (బుధవారం) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఎల్లుండి (బుధవారం) ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. వయనాడ్లో పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, తన కూతురు ప్రియాంకాగా గాంధీ కోసం ప్రచారం చేయబోతున్నారు. వయనాడ్ లోక్సభా స్థానం నుంచి ప్రియాంకా అరంగ్రేటం చేయబోతున్నారు. సి
Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది.
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.