వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
Sambal Conflict: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్‌లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ భారీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు వాయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందులో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ 4లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. దీనిపై ట్విటర్‌లో రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్…
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె గెలుపొందారు. తాజాగా ప్రియాంక విక్టరీపై భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు.
Bypoll Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు వయనాడ్, యూపీలో జరగబోయే ఉప ఎన్నికలపై నెలకొంది. వయనాడ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలుపొందడంతో ఆయన వయనాడ్ సీటుని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వయనాడ్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.