రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారని ఇటీవల ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం కోసం బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదని, ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రియాంకాగాంధీ, ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మోడీని విషసర్పంతో…
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ తాజా నిరసనను కొనసాగించారు.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఆమె సందడి చేశారు.