తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 8న హైదరాబాద్ రానున్న ప్రియాంక.. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. మే 5న ప్రియాంక తెలంగాణకు వస్తారని ఇటీవల కాంగ్రెస్ నాయకులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. కర్నాటకలో ప్రియాంక గాంధీ బిజీబిజీగా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్‌ను ఏఐసీసీ మార్చడంతో రద్దు చేశారు. ఏఐసీసీ మార్చిన షెడ్యూల్ ప్రకారం ప్రియాంక మే 8న తెలంగాణలో పర్యటించనున్నారు.
Also Read : Rains and Thunderstorms: ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..!
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మానిక్ రావ్ థాక్రే ముఖ్య నేతలతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 8న ప్రియాంక గాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో చేయాల్సి ఏర్పాట్లపై ఆయన జూమ్ ద్వారా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 10 కర్ణాటక ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. అయితే.. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. అయితే ఈ క్రమంలో నేడు నిర్వహించనున్న కర్ణాటక ప్రచారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. అంతేకాకుండా.. ప్రియాంకగాంధీ నేడు కర్ణాటకలో రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?