Talasani Srinivas Yadav Reaction To Congress Leaders Comments: ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డిలపై మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే! దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంకా గాంధీపై తలసాని చేసిన వ్యాఖ్యలు.. ఆయన దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రమిచ్చి, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తీర్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంకపై విమర్శలు చేయడం దారుణమన్నారు. రేవంత్‌పై తలసాని చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్, కేటీఆర్‌లను పొగడటం తప్ప అంతకుమించి తలసాని చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. ఇలా కాంగ్రెస్ నేతలు ఎటాక్ చేయడంతో.. మంత్రి తలసాని తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు.
Nikki Tamboli: పైట జార్చి మరీ పరువాలను చూపించి హీటెక్కిస్తోందే
‘‘ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వ్యవహరించాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా.. మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శలు చేయడం కరెక్టా? తమ పార్టీ నేతలపై అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో నేను ఆవేదన చెందాను. బాధ్యత కలిగిన మంత్రిగా నేను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. పార్టీలు వేరైనప్పటికీ విమర్శలు అర్థవంతంగా ఉండాలి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదు. ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ.. ఒకరినొకరు గౌరవించుకోవాలి’’ అని మంత్రి తలసాని చెప్పారు. అంతేకాదు.. విమర్శకు ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన హెచ్చరించారు కూడా!
Malaika Arora: ఆకులో ఆకువై.. పువ్వులో పువ్వువై.. అందాలను ఒలికిస్తుందిలా
కాగా.. మంత్రి తలసాని ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నిన్న ఆమె (ప్రియాంక) వచ్చింది. ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఆ పొట్టోడు డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడి నోటికి అడ్డు అదుపు అనేదే లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను వాడు వీడు అని మాట్లాడతాడు. ఇంత లేడు, వాడి పర్సనాలిటీ ఎంత, వాడెంత? పిసికితే ప్రాణం పోతుంది. వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు’’ అంటూ రెచ్చిపోయారు. ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలపైనే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.