మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ తాజా నిరసనను కొనసాగించారు.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్‌లో ఆమె సందడి చేశారు.
పాటియాలా కోర్టు నుంచి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నవజ్యోత్ సిద్ధూ రాహుల్ గాంధీని కలిసారు. 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సిద్ధూ ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. పంజాబ్ కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు.
Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పీఏ తనను చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు అర్చనా గౌతమ్. ఈ విషయమై మీరట్ లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం రావడంతో గురువారం ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
Priyanka Gandhi criticizes BJP: చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు అన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని తీర్మానం చేశాయి. ఇదిలా ఉంటే చివరి రోజు రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్‌లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది.
భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది.
కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.