ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పుకు AICC ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదిలా వుండగా ప్రియాంకా గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఉండేందుకు ప్రియాంకకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమెను లోక్ సభలో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.…
కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక మరింత ఆలస్యమవుతుంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రాజకీయ ఎత్తుగడలు మాత్రం మొదలయ్యాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ పాకులాడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందుకోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల సమరంలో జోరుమీదున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. శుక్రవారం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో పెట్టిన సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీ పై కూడా దృష్టి సారించింది. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది.
Ponguleti-Jupally: ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుల భేటీ కానున్నారు. ఇవాల మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో రాహుల్ తో జరిగే సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు.
Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. ఆమె జబల్పూర్ జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు.