తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగుతుంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే ఈ బస్సు యాత్రలో రాహుల్ పర్యటించనున్నారు. ఈ యాత్రలో నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతులు, మహిళలతో ఆయన సమావేశం కానున్నారు.
Read Also: Kajal: లేడీ బాస్ లుక్ లో కాత్యాయని
బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..!
రేపు మధ్యాహ్నాం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రామప్ప ఆలయానికి ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు చేరుకోనున్నారు. రామప్ప టెంపుల్లో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ఈ అన్నాచెల్లెళ్లు ప్రారంభించనున్నారు. ఇక, రామప్ప గుడి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మహిళలతో రాహుల్, ప్రియాంకా ప్రత్యేకంగా భేటీ అవుతారు. ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీకి ప్రియాంక గాంధీ వెళ్లిపోతారు. ములుగు బహిరంగ సభ నుంచి భూపాలపల్లికి బస్సు యాత్ర చేరుకొనుంది. భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహిస్తారు. రాత్రికి.. భూపాలపల్లిలోనే ఆయన బస చేస్తారు.
Read Also: Sourav Ganguly: మా రోజుల్లో అప్పటి పాక్ టీమ్ ఎలా ఉండేది అంటే..?
ఇక, ఎల్లుండి (19వ తేదీన) భూపాలపల్లి నుంచి మంథనికి కాంగ్రెస్ బస్సు యాత్ర చేరుకోనుంది. మంథనిలో పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు ఉంటారు. మంథని నుంచి పెద్దపల్లికి ఈ బస్సు యాత్ర సాగనుంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు కొనసాగనుంది.. ఇక, రాత్రికి కరీంనగర్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. అయితే, 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్ వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ జరుగనుంది. పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొంటారు. దీంతో 20వ తేదీ సాయంత్రం తో టీ కాంగ్రెస్ బస్సుయాత్ర మొదటి విడత ముగియనుంది.