తెలంగాణ పోలీసులను ఓ రిమాండ్ ఖైదీ బురడీ కొట్టించాడు. కోర్టు ఆవరణలో కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే.. పోలీసుల కండ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబసభ్యులను డీటెయిల్స్ అడిగి పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల సబ్ జైలులో పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ రిమాండ్…
జగిత్యాల సబ్ జైలులోని ఓ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశంకు బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పి వచ్చింది. సబ్ జైల్ నుండి హుటాహుటిన అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న మల్లేశం ఆసుపత్రిలోనే ఈరోజు కన్నుమూశాడు. Also Read: Peddapur Gurukul School: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో…
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఓ ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలకు గురిచేశారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారి దాడి చేయడంతో ఖైదీకి తీవ్ర రక్తస్రావం అయింది. తన నివాసంలో పనులు చేయించుకుంటున్న ఉన్నతాధికారి.. ఖైదీపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి కేంద్ర కారాగారానికి చెందిన ఓపెన్ జైలులో సుభానీ అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఓపెన్ ఎయిర్ ఖైదీతో ఓ ఉన్నతాధికారి తన…
తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్‌హెచ్‌ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్‌పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్‌లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు…
సింగపూర్‌లో ఒక కిలోగ్రాము గంజాయిని అక్రమంగా తరలించడానికి కుట్ర పన్నిన ఖైదీని ఉరితీశారు. 46 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన గంజాయి రవాణాదారు మరణశిక్షకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను సింగపూర్‌లోని కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.
పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనం రేపింది. ఇటీవల పోస్కో చట్టం నేర ఆరోపణతో ఏటూరునాగారానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు.
NCRB Data: దేశంలో నేరాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. కోట్ల కొద్ది కేసులు పరిష్కారం కాకుండా కోర్టుల్లోనే పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికే నేరాలు చేసిన వాళ్లతో జైళ్లన్నీ నిండుకున్నాయి.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జైళ్ళ శాఖ డీజీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్ద నేరస్తుడికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది, అధికారులు స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీకి అటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు అధికారులు చెప్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబుకు ప్రత్యేక గది కేటాయించి, రెండు సెల్‌ఫోన్లతో నిత్యం…