ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో మంత్రికి, ముఖ్య కార్యదర్శికి మధ్య విభేదాలు ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌కు అనుగుణంగా ఉంటే...సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం సరైన సలహాలు ఇచ్చి సవరించుకునే విధానాన్ని వివరించాలి. ఇక్కడే మంత్రి కొండా సురేఖకు, తన శాఖ పరిధిలోని ఓ ముఖ్య కార్యదర్శి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర విద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,104 పాఠశాలల్లో 3 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీ…
అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాలు ద్వారా లబ్ది పొందేందుకు వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్ లకు వచ్చి తమ విన్నపాలను అందించేందుకు షెడ్యూల్డ్ సమాచారాన్ని తప్పని సరిగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు.
డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్హులైన వారిలో ఒకరికి తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీ అంజనీకుమార్ లేదా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాలో ఒకరిని నియమించే అవకాశం ఉంది.
Telangana Best in India: ఈఎస్‌జీ.. అంటే.. ఎన్విరాన్‌మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్‌జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్‌జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు.