ఏపీలో అంగన్ వాడీ పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించామన్నారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ. ఏపీలో మొత్తంగా 55,607 అంగన్వాడీలు ఉన్నాయి.ప్రతి 25 అంగన్వాడీలకు ఓ సూపర్ వైజర్ ఉండాలి.. కానీ ప్రస్తుతం 60 అంగన్వాడీలకు ఓ సూపర్ వైజర్లు మాత్రమే ఉన్నారు. దీంతో 560 అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. 21 వేల మంది పరీక్షలు రాశారు. ఈసారి స్పొకెన్ ఇంగ్లీష్ టెస్ట్ కోసం పెట్టాం. అయితే 21 వేల మంది స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోస్ చూడాలంటే కష్టం కాబట్టి మెరిట్ లిస్టులో వచ్చిన వారి స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పాం.
Read Also: MLC Ashokbabu: హరీష్ రావు ఏపీ టీచర్లతో మాట్లాడితే మన పరువు గోవిందా
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించే పరీక్ష నిర్వహించాం. రాతపరీక్షల మార్కులను మేం బయటపెట్టలేదు. మొత్తం ప్రక్రియ పూర్తైంది. హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి.. ఫలితాలు ఇవ్వడం లేదు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే కీ విడుదల చేయలేదు. చాలా పారదర్శకంగా పరీక్ష నిర్వహించాం. 1190 మంది నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోస్ తెప్పించాం. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం. అవసరమైతే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం జగన్ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంగన్ వాడీ పోస్టుల భర్తీ విషయంలో న్యాయపరమయిన చిక్కుల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
Read Also: largest flower : ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు