Telangana DGP: రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఆ ఇద్దరిలో ఒకరు .. రేపు ఉత్తర్వులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Mahender Reddy will retire on 31st of this month: తెలంగాణ డీజీపీ నియామకం ఉత్కంఠ రేపుతోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్హులైన వారిలో ఒకరికి తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీ అంజనీకుమార్ లేదా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాలో ఒకరిని నియమించే అవకాశం ఉంది.
Read also: Russia: పుతిన్‌ను అంతం చేయడానికి అమెరికా కుట్ర
Also Read
మరో రెండు రోజుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్న చర్చ సాగుతోంది. డీజీపీ పదవీకాలాన్ని పొడిగిస్తారా.. లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతానికి మధ్యంతర ప్రాతిపదికన డీజీపీ నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్హులైన వారిలో ఒకరికి తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డీజీ అంజనీకుమార్ లేదా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాలో ఒకరిని నియమించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Read also: Fight on flight: ఎయిర్‌బస్‌ను ఎర్ర బస్సు చేశారు కదరా.. ఫ్లైట్‌లో చితక్కొట్టుకున్న ప్రయాణికులు
డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. డీజీపీ నియామకానికి సంబంధించి 2006లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు అర్హులైన అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపాల్సి ఉంది. UPSC ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వారిలో ఒకరిని డీజీపీగా నియమించాలి. ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ అమలవుతున్న దాఖలాలు లేవు. సుప్రీంకోర్టులో అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. మరోవైపు, డీజీపీని ఎంపిక చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తూ 2018లో తెలంగాణ పోలీస్ సెలక్షన్ అండ్ అపాయింట్‌మెంట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్-హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ అనే బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఆ బిల్లు ప్రకారం ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు.
2017 నవంబర్ 12న డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయడంతో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న మహేందర్ రెడ్డిని తాత్కాలికంగా ఆ స్థానంలో నియమించారు. ‘తెలంగాణ పోలీసు చట్టం 2018’ని సవరించి మార్చి 10న గెజిట్‌లో ప్రచురించి, దాని ఆధారంగా మహేందర్‌రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా 2018 ఏప్రిల్‌లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేడర్ వివాదం పరిష్కారం కాకుంటే, కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా డీజీపీని నియమించాలని యోచిస్తున్నారు.
TSPSC : నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
తాజావార్తలు
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!