ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
Railway Fare: భారతీయ రైల్వేలను మెరుగుపరచడానికి స్టేషన్ల పునరాభివృద్ధి కింద, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 508 రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అనుసంధానించబడతాయి.
ఉత్తరప్రదేశ్ లో నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యోగి క్యాబినెట్ మంత్రి డాక్టర్. సంజయ్ కుమార్ నిషాద్ తన కమ్యూనిటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాశారు. తన జీవితాంతం మత్స్యకారుల సమాజానికి అంకితమై ఉంటానని లేఖలో పేర్కొన్నారు. మచ్చువా సర్వహిత్ మరియు నిషాద్ పార్టీతో కలిసి తన ఏకైక తీర్మానం అని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీని దక్షిణాదిలోని ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలనే దానిపై బీజేపీ కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఉన్న ఎంపీ సీట్లలో కానీ, తెలంగాణలోని సికింద్రాబాద్ వంటి సీటు నుంచి కానీ.. లేదా తమిళనాడు నుంచి కానీ పోటీ చేయించేందుకు అన్వేషణ చేస్తున్నారు. ఈ కసరత్తు త్వరలో పూర్తి చేసి మోడీ పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మల్లు రవి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై అణిచివేతకి నిరసనగా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు ఆయన…
ప్రధానమంత్రిపై దుర్భాషలాడడం అవమానకరమైనదని,బాధ్యతారాహిత్యమైనదని.. అయితే అది దేశద్రోహం కాదని, పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహ కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
దేశానికి ప్రధాన మంత్రి ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ షరతు పెట్టారు. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అన్నారా లేదంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రూ. 1000 కోట్లు లేదా రూ.2 వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి అప్పుడు రాష్ట్రానికి రావాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల జూలై 7, 8 తేదీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. కాగా.. ఈ క్రమంలో తెలంగాణలో జూలై 8న రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 7, 8 తేదీల్లో 4 రాష్ట్రాలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ మరియు రాజస్థాన్‌లలో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో డజనుకు పైగా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.