ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీటితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు దృష్టి పెట్టారు. అంతేకాకుండా.. ఇండియా, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ తొలి సమావేశం మినిట్స్‌పై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.
ప్రధాని మోడీ సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో పర్యటించనున్నారు. జకార్తాలో జరుగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్‌పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. ఉదయం 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.
అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.