వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులలో చేరుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతుంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 30 వరకు 246 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.