Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో 2021లో అధికారం చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ముత్తాఖీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది.
జర్నలిజం డెఫినేషన్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదన్నారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. వాళ్లు, మీరు ఒక్కటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అత్యవసర పరిస్థితిని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి దినంగా అభివర్ణిస్తారు. అత్యవసర పరిస్థితి సమయంలో, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు, ఆందోళనకారులు స్టెరిలైజేషన్ నుంచి జైలు శిక్ష వరకు పోరాటాలు చేయాల్సి వచ్చింది.