Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో 2021లో అధికారం చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ముత్తాఖీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చిన తాలిబాన్ మంత్రి, ప్రతినిధుల బృందం మహిళలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేదని పలువురు అంటున్నారు.
Read Also: Trump Tariffs: భారత్‌కు ట్రంప్ గుడ్ న్యూస్.. “జనరిక్ మందుల”పై సుంకాల మినహాయింపు.?
రెండు దేశాల సంబంధాలు, చర్చలపై ఆఫ్ఘాన్ మంత్రి మీడియా సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేదు. ఇది లింగ అంతరాయాన్ని చూపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇది ఆఫ్ఘాన్‌లో తాలిబాన్ మహిళల్ని అణిచివేస్తున్న విధానానికి అద్ధం పడుతుంది. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది, 2200 మంది మరణించారు. ఈ సమయంలో సహాయచర్యల్లో పాల్గొన్నవారు మహిళల్ని తాకడానికి కూడా ప్రయత్నించలేదు. శిథిలాల్లో చిక్కుకున్న మహిళల్ని రక్షించలేదు. చివరకు ఆ భూకంప భారాన్ని మహిళలే భరించాల్సి వచ్చింది.
తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో మహిళలపై నిర్భందం ఎక్కువైంది. చాలా వరకు మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లాలన్నా భర్త లేదా ఇతర కుటుంబీలకు ఉంటేనే సాధ్యమవుతుంది. కాదని నియమాలను ఉల్లంఘిస్తే బహిరంగంగా కొరడా దెబ్బలతో శిక్షిస్తున్నారు. మహిళల విద్యను నిషేధించారు.