Republic Day 2025: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) జరుపుకుంటోంది. ఇందుకోసం ముమ్మరంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే ప్రధాన ఆకర్షణ ఇందులో జరిగే పరేడ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్ లో దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం,…
Halwa Ceremony: కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి.
National Sports and Adventure Awards: నేడు (జనవరి 17)న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరు ప్రముఖ క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్, యూత్ చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. వీరితోపాటు పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. శీతాకాల విడిది కోసం విచ్చేసిన రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఘన స్వాగతం పలికారు.
రేపు గుంటూరు జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో.. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికార యంత్రాంగం... మంగళగిరి AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనడం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
President Droupadi Murmu In Parliament: సోమవారం నాడు మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాణం, చారిత్రక ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని…
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్ మంథన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో 'కోటి దీపోత్సవం' దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 13వ రోజు మార్మోగిపోయింది. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవం వేదికగా భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.