దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా గత సంవత్సరం నుంచి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ "భిన్నత్వం లో ఏకత్వం" అనే స్ఫూర్తిని…
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అలాగే ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ను కూడా కలిశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కష్టాలు పెరిగాయి. సత్యేంద్ర జైన్‌పై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ఫైల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు . రత పౌర రక్షణ నియమావళిలోని సెక్షన్ 218 కింద 60 ఏళ్ల జైన్‌పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని అనుమతి కోరింది.
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంఘటన వల్ల ప్రభావితమైన ప్రజలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. అంతకముందు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి యూపీకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని రాష్ట్రపతి పుణ్య స్నానం ఆచరించారు. అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం…
Sonia Gandhi: పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అని స్పందించడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతిని అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Sonia Gandhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్‌కి ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదిలా ఉంటే, రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. Read Also: Maha Kumbh Mela: కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం.. 16,000…
Prabowo Subianto : ఈసారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత సాయంత్రం ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు.
Republic Day: భారతదేశం ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా భారత్‌కి శుభాంక్షలు చెబుతున్నాయి. భారత మిత్ర దేశం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపారు.
India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…