Republic Day: భారతదేశం ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా భారత్‌కి శుభాంక్షలు చెబుతున్నాయి. భారత మిత్ర దేశం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపారు.
Read Also: Bangladesh: మహ్మద్ యూనస్‌లకు ట్రంప్ షాక్.. ఇక బంగ్లాదేశ్ అడుక్కుతినడమే..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హృదయపూర్వక అభినందనలు చెప్పారు. ‘‘75 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం భారతదేశం యొక్క ప్రభావవంతమైన రాష్ట్ర సంస్థలను నిర్మించడానికి మరియు స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య అభివృద్ధికి పునాది వేసింది. అప్పటి నుండి, మీ దేశం సామాజిక ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు ఇతర రంగాలలో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయాలను సాధించింది. అంతర్జాతీయ రంగంలో తగిన అధికారాన్ని పొందింది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అభినందనలు తెలిపింది.
✉️ Russia's President Vladimir #Putin sent heartfelt congratulations to President of India @rashtrapatibhvn and Prime Minister of India @narendramodi on the occasion of Republic Day.
🔗 https://t.co/qlfsJo6ILV#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/s8fSNPJzoJ
— MFA Russia 🇷🇺 (@mfa_russia) January 26, 2025