Bandi Sanjay: ప్రయాగరాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.
Mahakumbh 2025 : మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో అర్థరాత్రి తొక్కిసలాట జరిగింది. దీని తరువాత పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత మధ్య స్నానం మళ్లీ ప్రారంభమైంది.
మహా కుంభమేళాలో వింతలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 15 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించి రికార్డ్ సృష్టించారు.
Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
Mahakumbh 2025 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గంగానదిలో స్నానం చేశారు.
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరుగుతోంది. ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమంలో చేరి గంగామాతకు మనసారా పూజలు చేస్తున్నారు. ఈ వేడుక జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకు దాదాపు నలభై అయిదు రోజులపాటు కొనసాగుతుంది. పండితుల ప్రకారం, కుంభమేళా పుణ్యస్నానాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం, గంగమ్మతల్లిని ఆచారమయిన విధంగా పూజించడం అత్యంత…
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అక్కడ జొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, సకాలంలో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక అధికారులు. సమాచారం ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలో ఆగి ఉన్న…
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళలో ఆదివారం రోజు భారీ అగ్ని ప్రమాదం రిగింది. సెక్టార్-19 క్యాంప్‌సైట్ ప్రాంతంలో రెండు నుండి మూడు గ్యాస్ సిలిండర్లు పేలిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తుల భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ హాని జరగలేదు. పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు.
నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.