Maha Kumbh Mela from space: “వెలిగిపోతున్న కుంభ మేళా”.. అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి ఫోటో..
- ఆకాశం నుంచి అద్భుతంగా కుంభ మేళా..
- అంతరిక్ష నుంచి ఫోటో తీసిన నాసా వ్యోమగామి..
- కుంభమేళా వెలిగిపోతుందంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు ఒకే చోటకు చేరడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. చివరకు పాకిస్తాన్, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా కుంభ మేళ గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ అద్భుతమైన జనసమాగమం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను కూడా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసాకు చెందిన వ్యోమగామి డాన్ పెటిట్ కుంభమేళని ఫోటో తీశారు. 400 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ఐఎస్ఎస్ నుంచి తీసిన ఫోటోలో ప్రయాగ్ రాజ్, ముఖ్యంగా కుంభమేళా జరుగుతున్న ప్రదేశం ‘‘ వెలిగిపోతోంది’’. ‘‘2025 మహా కుంభమేళా గంగా నది తీర్థయాత్ర రాత్రిపూట ISS నుంచి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం బాగా వెలిగిపోతుంది’’ అంటూ ఎక్స్‌లో తన ఫోటోలను పోస్ట్ చేశారు.
Also Read
Read Also: Olive Ridley turtles: చెన్నై తీరంలో వేల సంఖ్యలో ‘‘ఆలివ్ రిడ్లే తాబేళ్ల’’ మృతి..
ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి భారీగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. తాజాగా నాసా వ్యోమగామి ఫోటో వైరల్‌గా మారింది. ఇది ఒక “సూపర్ నోవా”ను గుర్తు చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘వావ్ విజువల్స్ అద్భుతం’’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
యూపీ సర్కార్ కుంభమేళ కోసం 24 గంటల పాటు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంది. రూ. 400 కోట్లతో 182 కి.మీ హై టెన్షన్ లైన్స్, 40,000 రీ ఛార్జబుల్ బల్బులు, త్రివేణి సంగమం వద్ద 2700 సీసీటీవీ కెమెరాలు, నీటిలో ప్రయాణించే డ్రోన్లు, ఏఐ ఆధారిత భద్రతా చర్యల్ని ఏర్పాటు చేసింది.
2025 Maha Kumbh Mela Ganges River pilgrimage from the ISS at night. The largest human gathering in the world is well lit. pic.twitter.com/l9YD6o0Llo
— Don Pettit (@astro_Pettit) January 26, 2025
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!