హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి శుక్రవారం సిమ్లాలో సమావేశం కానున్నారు. హిమాచల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరగనుంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ మార్క్‌ను దాటింది. 68 మంది సభ్యులు గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాంగ్రెస్ 39 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసింది. 26 స్థానాల్లో బీజేపీ గెలవనుంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఓటమిని అంగీకరించారు.