కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లోను ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడు. దాంతో ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. వారిలో ముందుగా మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రవి…
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని వీక్షించి..…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చూసి నీరుగారి పోయిన ఆయన ఫ్యాన్స్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజేఎఫ్-2’ చూశాక ఆశలు చిగురించాయి. ‘కేజీఎఫ్-1’తోనే ఆల్ ఇండియా ఆడియెన్స్ మనసు దోచిన ప్రశాంత్ నీల్, రెండో భాగంతో మరింతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించిన విజయ్ కిరగండూర్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. అందువల్లే అభిమానుల్లో ఆశలు మళ్ళీ అంబరం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ‘కేజేఎఫ్-2’…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు…
KGF 2 కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు రాఖీ భాయ్. ఆయన వయోలెన్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్-2’ హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఈరోజు అంటే విడుదలైన 5వ రోజు 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది. ఈ రికార్డును క్రియేట్ చేయడానికి ‘బాహుబలి 2’ మూవీకి 6 రోజులు…
ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” గురించే టాక్. రికార్డ్స్ తో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో కొల్లగొడుతున్నాడు రాఖీ భాయ్. ఈ సినిమాలో యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, అద్భుతమైన విజువల్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి “కేజీఎఫ్-2”…
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తిగా గమనిస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. “రాధేశ్యామ్”తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ “సలార్”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక “సలార్” షూటింగ్ సగం పూర్తి…
KGF 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. యష్ దర్శకత్వంలో, సీన్ సీన్ కూ ఒళ్ళు గగుర్పొడిచే ఎలివేషన్స్, నేపథ్య సంగీతం, రాఖీ భాయ్ వయోలెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్… KGF 2 తెలుగు వెర్షన్ లోని పవర్ ఫుల్ డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ డైలాగ్స్ రాసింది మనోడే ! హనుమాన్ చౌదరి అనే మన తెలుగు వ్యక్తి కావడం విశేషం.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటీవలే “రాధేశ్యామ్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ప్రభాస్ ఖాతాలో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్టులు షూటింగ్ దశల్లో ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి ముందు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ప్రభాస్. అయితే తాజాగా ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ప్రభాస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై స్పందించారు. Read Also…
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా, టికెట్లు హాట్ కేకుల్లా…