యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో జోష్ మీదున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక మరోపక్క ప్రశాంత్ నీల్ సైతం ‘కెజిఎఫ్ 2’ విజయంతో జోరు మీద ఉన్నాడు. ఇక వీరిద్దరూ కలిసి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులను మొదలుపెట్టినట్లు తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈవోలు ప్రశాంత్ నీల్, తారక్ మధ్య అనుబంధం పెరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహబంధం లోకి అడుగుపెట్టి మే 5, 2022 సంవత్సరంతో పదకొండేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఈ జంట తమ వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఇక ఇదే రోజు ప్రశాంత్ నీల్, లిఖిత ల పెళ్లి రోజు కూడా కావడం విశేషం. దీంతో ఈ రెదను జంటలు తమ పెళ్లి రోజు వేడుకలను ఎన్టీఆర్ ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తారక్, లక్ష్మీ ప్రణతి జంట, ప్రశాంత్ నీల్, అతని భార్య లిఖిత నలుగురు కలిసి దిగిన ఫోటో చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇక ఈ ఫోటోలను తారక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ” మనం ఎప్పుడైతే వార్షికోత్సవాలను షేర్ చేసుకుంటామో.. అవి సెలబ్రేషన్స్ అవుతాయి” న్యూ బిగినింగ్స్ అంటూ రాసుకొచ్చాడు. ఇక దీంతో ఈ కాంబో త్వరగా తమ తదుపరి సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటోలో తారక్ లుక్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఆర్ఆర్ఆర్ కోసం బరువు పెరిగిన తారక్.. ఈ సినిమా కోసం బరువు తగ్గినట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలను అభిమానులు వైరల్ గా మార్చేస్తున్నారు.