అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఐదు వారాలు పూర్తి కాకముందే, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే, ఇక్కడో ఫిట్టింగ్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే, రూ. 200 కట్టాల్సి ఉంటుంది. రెంటల్స్ విధానంలో ఈ చిత్రాన్ని అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా.. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సినిమాలు చూసేందుకు వీలుంటుంది. అయితే.. ఎర్లీ యాక్సెస్‌లో భాగంగా ముందుగానే స్ట్రీమ్ చేస్తుండడంతో, రెంటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకా ఈ సినిమాని థియేటర్లలో చూడని వాళ్ళు.. రూ. 200 గాను రెంట్‌కి తీసుకొని, ఇంట్లోనే సౌకర్యవంతంగా వీక్షించొచ్చు.
కాగా.. గత నెల 14వ తేదీన భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం, కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి కన్నడ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్‌ని సైతం వెనక్కు నెట్టేసి, దంగల్, బాహుబలి2ల తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీనిద్ధి శెట్టి కథానాయికగా నటించింది. ‘కేజీఎఫ్: చాప్టర్1’ కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్‌లో.. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టండన్‌లతో పాటు రావు రమేశ్, ప్రకాజ్ రాజ్‌లు కీలక పాత్రల్లో నటించారు.
thrill ×2 | craziness ×2 | K.G.F ×2 💥#EarlyAccessOnPrime, rent now pic.twitter.com/FDtYdtro0l
— prime video IN (@PrimeVideoIN) May 16, 2022