గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వివాదం విషయమై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించారు. అయితే ఆయన ప్యానల్ లో అంతకు ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్…
చిరంజీవి సోమవారం గోపీచంద్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ చూసి, దర్శకుడు సంపత్ నందితో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, యంగ్ హీరో ఆది పినిశెట్టి ‘క్లాప్’ మూవీ టీజర్ ను సైతం చిరంజీవి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘క్లాప్’ విజయం కావాలని…
“మా” ఎన్నికల వ్యవహారం గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకాష్ రాజ్ “మా” ఎన్నికల్లో తన ప్యానెల్ కు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. దాంట్లో అందరికీ షాకిస్తూ హేమ, జీవిత రాజశేఖర్ పేర్లు కూడా కన్పించాయి. గతంలో మహిళలకు అవకాశం అంటూ ఈ ఇద్దరూ “మా” అధ్యక్ష పదవికి పోటీదారులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా వారిద్దరూ ప్రకాష్ రాజ్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినిమాల వలె ట్విస్టులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోనే వాళ్ళు పేర్లు ఉంటడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ జీవిత రాజశేఖర్ తో రెండు గంటలకు పైగా మా కార్యచరణ గూర్చి మాట్లాడాను. ఆమెకు నచ్చడంతో నా ప్యానెల్‌లో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించబోతున్నాయి. కేవలం రెండేళ్లపాటు ఉండే మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నటీనటులు తీవ్రంగా పోటీపడుతున్నారు. కేవలం 900మంది సభ్యులు ఉండే మా అసోసియేషన్ కు నిర్వహించడం ఈసారి కత్తిమీద సాములా మారింది. నటీనటుల మధ్య నెలకొన్న ఈగోల వల్ల ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపింపజేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటుండటంతో మా పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం…
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏం చేసినా విలక్షణంగానే ఉంటుంది. తాజాగా ఓ వెరైటీ పని చేశారాయన. పెళ్లి రోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 56 ఏళ్ల ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మను రెండోసారి వివాహమాడాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ట్విటర్ లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. వీటిలో భార్యను ముద్దాడుతున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. అలాగే వారు రింగులు మార్చుకోవటాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు.…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలు అభిమానులను షాక్ కు గురిచేసింది. ప్రకాష్ రాజ్ కు గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే మరో పెళ్లి అనే వార్తలు అభిమానులను కాస్త గందరగోళానికి గురిచేశాయి. నిన్న ప్రకాష్ రాజ్ పెళ్లి రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ…