మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్…
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో గాయాల పాలైన ప్రకాష్ రాజ్ చేతికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ చికిత్స తరువాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమా షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు. దానికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్వాలియర్ విమానాశ్రయంలో దర్శకుడు మణిరత్నం, నటులు కార్తీ మరియు ప్రకాష్ రాజ్ చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి. Read Also…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు. కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే షూటింగ్ లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఆగస్ట్ 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం! ఆ సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కాలికి గాయమైంది. పొరపాటున జారి పడటంతో కాలికి చిన్నపాటి ఫ్యాక్చర్ అయ్యిందని స్వయంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి చేత సర్జరీ చేయించుకోవడానికి విమానంలో హైదరాబాద్ కు బయలు దేరినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. కంగారు పడాల్సింది ఏమీ లేదని, తాను బాగానే ఉన్నానని ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను వచ్చే నెల రెండోవారం…
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్…
విలక్షణ దర్శకుడు మణిరత్నం ఏది చేసినా అందులో ఏదో ఒక వైవిధ్యం చోటు చేసుకుంటుంది. జయేంద్ర పంచపకేశన్ తో కలసి మణిరత్నం నిర్మించిన వెబ్ సీరీస్ ‘నవరస’ ఆగస్టు 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మణిరత్నం అందించిన సిరీస్ కదా, తెలుగువారికి మొదటి నుంచీ ఆసక్తి కలుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగులోనూ అనువాదమయింది ‘నవరస’. పదాలు తెలుగులోనే వినిపించినా, పాటలు మాత్రం తమిళంలోనే వినిపిస్తాయి. కంగారు పడకండి! ఈ ‘నవరస’ తొలి ఎపిసోడ్…
ఏ మనిషీ ఎప్పుడూ ఒకేలా ఉండరు. మార్పు అనేది సహజం. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ లోనూ ఆ తరహా మార్పును తెలుగు సినిమా రంగం చూస్తోంది. గతంలో ప్రకాశ్ రాజ్ చాలా అంశాలలో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. ఆయన సినిమాల వేడుకలకు ఆయనే హాజరయ్యేవారు కాదు. నిమిషం కూడా వృధా చేయకుండా కాలంతో పరిగెత్తే వారు. ఎంతగా అంటే… కనీసం ఎలక్ట్రానిక్ మీడియాకు పండగల సందర్భంలో శుభాకాంక్షలు తెలపడానికి ఐదు, పది నిమిషాలు…
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ‘మా’ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. పోటీదారులు ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న వారికి వీరి వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నట్టు అవుతోంది. “మా” ఎన్నికల విషయమై గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులకు చక్కదిద్దడానికి రంగంలోకి కృష్ణంరాజు దిగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కృష్ణంరాజు ప్రస్తుత కౌన్సిల్‌తో పాటు రాబోయే ఎన్నికల విషయమై పోటీదారులతో సమావేశమవుతారు. Read Also : పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే…