మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినిమాల వలె ట్విస్టులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోనే వాళ్ళు పేర్లు ఉంటడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ జీవిత రాజశేఖర్ తో రెండు గంటలకు పైగా మా కార్యచరణ గూర్చి మాట్లాడాను. ఆమెకు నచ్చడంతో నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు. అలాగే నటి హేమతో కూడా ఈ విషయమై మాట్లాడాను. ఆమెకు కూడా మా ఆలోచనలు నచ్చడంతో నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు’ అని ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
కాగా, ప్రకాష్ రాజ్… జీవిత రాజశేఖర్, హేమతో జరిగిన చర్చలు ఫలించడంతో ఆయనకు ప్రధాన పోటీ మంచు విష్ణు కానున్నారు. త్వరలోనే మంచు విష్ణు కూడా మీడియా సమావేశంతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ‘మా’ భవన నిర్మాణానికి విష్ణు ఇటీవలే స్థలాలు కూడా వెతికారు. సినీ పెద్దలందరితో మాట్లాడిన తరువాత ఓ స్థలాన్ని ఫైనల్ చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ప్యానెల్ సభ్యులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.