ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో ఓ మంత్రి చిరంజీవితో నాకు సోదరభావం ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమకు అక్కరకు రాని సోదర భావం ఎందుకు. దాన్ని తీసుకెళ్లి చెత్తలో వేయండి అంటూ విరుచుకుపడ్డారు.
ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ ను లోకల్, నాన్-లోకల్ అంటూ విమర్శలు చేయటం తప్పు అని పవన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ను, ఆయన అభిప్రాయంగానే తీసుకున్నాను. అంతేగాని ఆయనతో నాకు గొడవలు ఏమీలేవు. సినిమా పరిశ్రమకు వచ్చే సరికి మేమంతా ఒకటి.. ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని పవన్ తెలిపారు.