మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.. చాలా కాలం నుంచి అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు.
మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఆయనకు జంటగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాని, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు.
ముగింపు దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే విడుదల కానుంది. తాజా సమాచారం మేరకు డిసెంబర్ లో విడుదల చేయాలనీ ప్లాన్స్ చేస్తున్నారట. అయితే ఈ చిత్రాన్నీ థియేటర్లోనే విడుదల చేద్దామనుకున్నటికి, ఏదైనా మంచి ఓటీటీ ఆఫర్ వస్తే అందులోనే విడుదల చేద్దామనుకుంటున్నారట. షూటింగ్ పూర్తి అయ్యాక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.