జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.. దర్శి నియోజకవర్గంలో ఏపీలో అత్యధికంగా 90.25 శాతం పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది అని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ కౌంటింగ్ రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్క అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున 28 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నాం.. ఒంగోలు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేకంగా 40 టేబుల్స్ ఏర్పాటు చేశాం.. కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ కి చేర్చాం.. కౌంటింగ్ సిబ్బందికి నాలుగు బ్యాచ్లుగా ట్రైనింగ్ ఇచ్చామని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Splendor Plus xtec 2.0 Price: ‘స్ల్పెండర్’ కొత్త వెర్షన్ విడుదల.. ధర, మైలేజ్ ఎంతంటే?
అలాగే, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్స్ దరఖాస్తులు జూన్ 1వ తేదీలోగా అందించాలి అని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. మూడంచెల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ సెంటర్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.. కౌంటింగ్ ఏరియా మొత్తం నో స్మోకింగ్ జోన్ గా ప్రకటించాం.. కౌంటింగ్ సమయంలో అవాంతరాలు కలుగజేయాలని చూస్తే ఎటువంటి చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడం.. అభ్యర్దులు కూడా కేవలం మూడు సార్లు మాత్రమే కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లి వచ్చే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకున్నాం అని కలెక్టర్ దినేష్ వెల్లడించారు.
Read Also: RBI : విదేశాల నుంచి టన్నుల కొద్ది బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ
ఇక, కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ ఎదురు NH16లో సింగిల్ లైన్ ట్రాఫిక్ డైవర్ట్ చేశాం.. ఈసీ ఉత్తర్వుల ప్రకారం కౌంటింగ్ కేంద్రంలో మూడంచెల భద్రత.. కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది.. కౌంటింగ్ ఏరియాలో నో ఆల్కహాల్ జోన్.. జిల్లా వ్యాప్తంగా 156 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాల ద్వారా బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక, జిల్లాలో 18 ముఖ్యమైన నాయకుల ఇళ్ళ దగ్గర ప్రత్యేక బందోబస్తు కొనసాగుతుంది అని ఎస్సీ సుమిత్ సునీల్ చెప్పారు.
Read Also: Gangs Of Godavari Review: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ
కాగా, 16 పార్టీ కార్యాలయాల దగ్గర పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ సునీల్ పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ ఘటన ఎదురైతే స్పాట్ యాక్షన్ కోసం మెజిస్ట్రేట్ లు అందుబాటులో అంటారు.. అన్నీ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ మాక్ డ్రిల్స్.. 765 గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు చేశాం.. పల్లె ప్రాంతాల్లో నాయకులతో పీస్ మీటింగ్స్ నిర్వహించాం.. పోలింగ్ రోజు ఘర్షణలను పాల్పడ్డ 265 మందిపై రౌడీ షీట్స్ పెట్టామని తెలిపారు. 185 సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. బెట్టింగ్స్ కూడా మానిటర్ చేస్తున్నాం.. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా బాణసంచాకు అనుమతి లేదు.. విజయోత్సవ సభలకు కూడా అనుమతి లేదు.. సోషల్ మీడియా, వాట్సప్ లో విభేదాలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు.. ఈసీఐ చెప్పే వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది అని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వెల్లడించారు.