Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కారు-ఆటో ఎదురెదురుగా వెళ్లి ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషయానికి వస్తే.. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎదురెదురుగా వెళ్లిన కారు, ఆటో ఢీకొన్నాయి.. ఈ ఘటనలో నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు.. క్షతగాత్రులను మార్కాపురం ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. వారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించే పనిలో పడిపోయారు.. మృతులు కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురంకు చెందిన షేక్ బాబు, అమానిగుడిపాడుకు చెందిన అభినయ్ గా గుర్తించారు పోలీసులు.